అమ్మభాష

అమ్మభాష ****విజయ గోలి

మధురమైన భావాలను ..
మనసు తీర పలికించే భాష ..
అమ్మ అనే పిలుపులోని మమత
నాన్న అనే పిలుపులోని సమత
వావి వరుసల వలపు పిలుపుల సరి
మాతృబాషను గాక మరి ఎక్కడ పరిమళించు …

పాలమీగడల రుచి ,జుంటితేనెల రుచి
పండుపనసల రుచి,మామిడి రసాల రుచి..
మల్లె,మొల్లల ,సన్నజాజుల ,సంపెంగల
సిరిచందనపు సుగంధాల పరిమళాలు ..
ప్రణయ కలహాల ఝరి,ప్రబంధాల శైలి ..
మాతృభాషను గాక మరి ఎక్కడ గుభాళించు ..

ఇందుగలడందు లేడను
సందేహము వలదన్నటుల
గ్రామీణమందైనా ,గ్రాంధికంబైనా ..
వ్యవహారమందైనా…ఏ తీరునందైన …
అమ్మ భాషను మించిన అన్నము కలదే…

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language