అమ్మబోకు అమ్మపాలు విజయ గోలి
గుడిలోపల గింజతిన్న గువ్వ
మసీదులో మంచినీళ్లు తాగుతుంది
ఏ మతమా గువ్వది .?.ఏ కులమా పిట్టది?
ఏ చెట్టు పిట్టకు లేని పట్టు నీకేల..ఓ మనిషీ…
గీతైనా బైబిలైనా ఖురానైన
పవిత్ర గ్రంధ మేదైనా చెప్పిందొకటే ..ధర్మం
ప్రేమించు ప్రేమపంచు
మానవత్వపు విలువ పెంచు
పరస్పరం సహకారం లేనిదే
సమాజానికి ప్రగతి ఎక్కడ
మనిషి మనిషికి చేయూత లేనిదె
మనుగడెక్కడ అడుగులేయు
..
మతం పేర సమాజాన్ని మంటపెట్ట పోకు
కులం పేర కుళ్ళు పెంచి కుష్టు రోగి కాబోకు
స్వార్ధాలతొ ..మూలాలను మరిచిపోయి
ఒక్కనాటి బ్రతుకు కొరకు
తుంచ పోకు భావి బ్రతుకు
ఒక్కనాటి మెతుకు కొరకు .
అమ్మపోకు అమ్మపాలు