అమ్మబోకు అమ్మపాలు
గుడిలోపల గింజతిన్న గువ్వపిట్ట
మసజిద్ లో మంచినీళ్లు తాగుతుంది
గీతైనా బైబిలైనా ఖురానైన
చెప్పిందొకటేగ….ధర్మం
పరస్పరం సహకారం లేనిదే
సమాజ మనుగడెక్కడ
నువు పీల్చే గాలి మతమేమిటో చెప్పి
మంట పెట్టు సమాజాన్ని
కులంపేర కుళ్ళు పెంచె కుష్టురోగి కాబోకు
ఒక్కనాటి మెతుకు కొరకుఅమ్మబోకు
అమ్మపాలు
విజయ గోలి