శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
నెలపొడుపున చందమామ అందమెంతొ అపురూపం
అంబరాని కాభరణం అవనికెంతొ అపురూపం
రోజుకొక్క రూపు చూపు అందలాన సొబగులతో
నవమినాటి నాజూకుల పయనమెంతొ అపురూపం
జిలుగు నీడ నిశికన్యక నీలికురుల ఆరబోత
జడబిళ్ళగ జాబిలినే నిలుపుటెంతొ అపురూపం
పాలపుంత దారులలో రాలుతున్న జరీపూలు
కలువపూల కనుల మెరియు కాంతులెంతొ అపురూపం
తళుకులీను తారలమది విరిశరముల విజయంగా
పున్నమిలో రారాజుగ రేయెంతో అపురూపం