అన్యధా శరణం నాస్తి 2

*అన్యధా శరణం నాస్తి ..త్వమేవ శరణం మమ.. విజయ గోలి

అన్యధా శరణం నాస్తి ..త్వమేవ శరణం మమ..

పిలిచే పిలుపులో ఆర్తే ఉంటే..

కోరి కొలిచే దేవుడు కొంగు బంగారమై ..

కొండంత అండగా.. దరికి రాకుండునా …

కోరేటి కోర్కెలో కొలతలే లేకుంటే ..

హరి అంతటా హరితమై ఉండగా..

తలిచిన క్షణమే తరలి రాకుండునా..

మానవసేవే మాధవ సేవ ..అనుకుంటే ..

నీ సేవకు వెను వెంటనే .. వేంచేయడా …

సర్వే జనా సుఖినో భవంతు..అన్నావంటే ..

జగద్రక్షగా నీకోసం భువికే దిగి వచ్చుగా .. విజయ గోలి

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language