శరణం నాస్తి. విజయ గోలి
అన్యధా శరణం నాస్తి ..త్వమేవ శరణం మమ..
ఆర్తితో ..పిలిచితే ..అరుదెంచడా ..స్వామి..
కోరి కొలిచే దేవుడు కొంగు బంగారమై ..
కొండంత అండగా.. దరికి రాకుండునా …
కొలిచేటి వేళ నిండు మనసే నీకుంటే ..
కోరేటి కోర్కెలో కొలతలే లేకుంటే ..
హరి అంతటా హరితమై ఉండగా..
తలిచినా.. క్షణమే తరలి రాకుండునా..
మానవసేవే మాధవ సేవ ..అనుకుంటే ..
నీ సేవకే తాను వేంచేయడా …
సర్వే జనా సుఖినో భవంతు..అన్నావంటే ..
జగద్రక్షగా భువికే హరి దిగి వచ్చుగా. …….విజయ గోలి .