మల్లినాధ సూరికళాపీఠం
అన్నపూర్ణ విజయ గోలి
విశ్వనాధుని తోడుగ విశాలక్షిగ
కాశీపురమున కొలువైన తల్లి
ఆదిశివునికే బిక్ష వేసి
పుడమికంతకు పూర్ణిమైనావు
అన్నపూర్ణగ ఆదరించేవు…
ఆది అంతము నీవని
అన్నమంటే నీవని
ఆటఆడి చూపినావు
అలుపుఎరుగని అమ్మవైనావు
జీవనాడికి జీవమైనావు
పసిడి కాంతుల
మిసిమి నవ్వుల
వెండిగిన్నెలో బంగరుగరిటతో..
కొసరి కొసరి మా కోర్కెలు తీర్చే
పాయసాన్నే పంచుమమ్మ పరమేశ్వరి
సర్వ మంగళ గౌరివే
సర్వైశ్వర్య ప్రదాయనిగ
పసుపుకుంకుమ వరములిచ్చి
పడతి భాగ్యము కాచుమమ్మ పరమపావని
పట్టెడు మెతుకులు పుట్టెడుగ చేసి
పుడమి కాచవే పార్వతి