గజల్ విజయ గోలి
అనుభూతుల ఆలాపన అలల కలిసి పోయింది
మనసు వెతల ఖజానాగ బతుకు మిగిలి పోయింది
ఒక్క తలపు మలుపు కొరకు మనోలేఖ రాసింది
అక్షరాలు కుదురులేక రాత మారి పోయింది
నిండు నీలి మేఘాలే వలపు పిలుపు వినలేదు
ఎడారిలో ఎండమావి ఎదుట నిలిపి పోయింది
అద్దంలో నారూపే అపరిచితగ తోచింది
నిశ్శబ్దం తన పేరే పిలిచి అలిసి పోయింది
పూరించని కథనంలో పున్నమెలా మెరిసేను
అర్ధాయువు తనదంటూ ప్రేమ తరలి పోయింది !!