అనిశ్చితం …9 /4 /2020 కరోనా … విజయ గోలి
చిక్కు బడిన మనసెందుకో …
జడివానకి తడిసిన నేలల్లే ..
చిత్తడి చిత్తడి గా వుంది ..
ఒక కొలిక్కి రాని ఆలోచనలు
దిక్కు తోచక పరుగెడుతున్నాయి ..
అంతమెక్కడో తెలియని దారిన ..
అంతరంగమెక్కడో ..ఆగిపోయింది ..
పట్టపగలుకు కటిక చీకటి కాటుకయ్యింది..
ప్రకృతి పచ్చగా పరిమళిస్తున్నా..
సహజత్వాన్ని సమీకరించుకుంటున్నా..
స్పందన లేని మనసు ..
నిశ్శబ్దాన్ని భేదించ లేకపోతోంది ..
ఎక్కడో ..ఏదో..తప్పు.. జరిగింది ..
నిబిడీకృతమై నిప్పు రాజుకుంది..
కార్చిచై ..కరోనాగ …కదిలింది ..
అరమరికలు లేకుండా అన్నివైపులా ..
భస్మాసుర హస్తాలతో విశ్వాన్ని ఆక్రమిస్తుంది ..
ఉప్పెనలా ..పెనుముప్పై ..పెరుగుతుంది ..
కష్టాలెప్పుడు .. కలకాలముండవు ..
కడగళ్ళను మాపేందుకు మంచికాలమొస్తుంది ..
కరోనాకు ..చిక్కకుండా ..
మనసులు ..మరింత ..దగ్గరగా ..
మనుషులమొకింత ..దూరంగా ..
మనకి మనమే పంజరంలో పక్షుల్లా ..
బందీలై బ్రతుకుదాము ..కొంతకాలం ..
కరోనాకు కాలం …చెల్లేవరకు… …..విజయ గోలి