శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
అధరము తాకక వేణువు పలకదు కన్నా
అలిగిన మువ్వలు లయలో కులకవు కన్నా
వెన్నెల కురవక వేడుక లేదులె కృష్ణా
పొన్నల మాటున పొందిక కుదరదు కన్నా
యమునా తీరపు కలువల కన్నులు … చిన్నా
వేచిన వేళల పొద్దే పొడవదు కన్నా
నీలపు మబ్బుల నీడల మెరిసే పింఛము
తొలకరి చినుకుల తనువే తడవదు కన్నా
రాధా మాధవ రాగమె రసమయ గానం
కలుషిత మంటని కలలదె విజయము కన్నా !!