అతివలు

తెలుగు సాహితీవన మహిళా మిత్రులందరికి …

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🌹🌹🌹🌹

🌹విజయ నీరాజనం 🌹 విజయ గోలి 8/3/2021

అవనిమీద అతివగా
అనునిత్యం అడుగడుగున
అంతరంగ సంగ్రామమే
అనురాగపు ఆవరణలో
అందమైన లక్ష్మణ రేఖలు

బాధ్యతల బరువులెపుడు
నువు మెచ్చిన బంధాలే
బలహీనత నీ బ్రతుకున
పరుచుకున్న ముళ్ళబాట
పదిలమెపుడు లేదులే

కనకదుర్గవైనా కాళికమ్మవైనా
కఠినమైన రూపు వెనుక
కన్నతల్లి కరుణే కదా
ఓరిమిలో ధరణివి కదా
తరుణి పేరున తరువు కదా

అంతరిక్షమంత ఎత్తు ఎదిగినా
అంబరాన సంబరమై నిలిచినా
ఆగవెపుడు నీపైన అణచివేతలు
పుడుతూనే కట్టు బానిసగా
కట్టివేసిన మృగ అహంకారం
కనుమరుగు చేస్తుంది కావ్యాలనే

అతివంటే యాగమంటూ
అతివంటే యోగమంటూ
అలలపై నిచ్చెనేసి
అందలం ఎక్కించేరు
అంతు తెలియని అగాధాల
ఆయువుతో ముంచేరు

మేలుకో మహిళా మేలుకో
ఎవరో వస్తారని ఎదురు చూడకు
తెలుసుకో నీశక్తి తెలివిగ నడుచుకో
నీ ఆత్మబలమే.. నీ బలం
అందుతుంది ఆనాడే
విశ్వమందున విజయ నీరాజనం🙏🏻

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language