అణువణువు*విజయ గోలి
మస్తకమే పుస్కకమై వెలిగించిన కాంతి రేఖ
అణువణువున చైతన్యపు..
అమృతమే నింపినది
నరనరమున శృతి లయలకు..
జతి తానై నిలిచినది..
భాష ఏది ఐన
భావముంటే చాలు
రాగమేది ఐన
రవళి జతలో ఎదుగును..
తంత్రులేవి ఐనా
సాధనుంటే మేలు ..
ఉరుము లోన సంగీతం ..
మెరుపు లోని నాట్యాన్ని ..
మేళవించి చూడు …
తుమ్మెద ఝంకారంలో ..
దాగివున్న ఓంకారం ..
తరచి చూడ సృష్టిలో
అణువణువున నిండి వున్న
అందమైన కళలెన్నో…
అదును తెలుసుకుంటే ..
ఆనందం …అంబరాల హద్దులనే దాటునుగా ..విజయ గోలి