అణుయుద్దం విజయ గోలి
అంతరంగం లో అణుయుద్ధం జరుగుతున్నా ..
అంత మౌనంగా ఉంటావెందుకు …
ఎక్కుపెట్టిన బాణాలన్నీ నీ ఎదను తూట్లు చేస్తున్నా..
తొణకవెందుకు ..బెణకవెందుకు ..
సర్దుబాటు నీ రక్తంతో సంధి చేసుకుందేమో ..
బానిసత్వపు బందీగా చరిత్రలో ఎపుడో చేరావుగా..
పుట్టిన ప్రతి జీవి తన ఉనికి చాటుకుంటుంది ..
ఉనికే లేనట్లు ..ఉలుకు పలుకు లేకుంటావు ..
కట్టుబాట్ల దుప్పటి క్రింద ఎన్నాళ్లని దాక్కుంటావు ..
బరితెగించినా..బ్రతకనీయదనా..నీ..ఆక్రోశం ..
ఒక్కసారి గర్జించి చూడు ..కించపరిచే ..జాతి..
నీ పాదాలముందు ..నిలబడుతుంది ….
ఎందుకో తెలుసా …నువ్వులేక అణువు కూడా కదలదు ..
కాదంటే కాళ్ళ బేరం…మాములేగా …విజయ గోలి .