అడవి కాసిన వెన్నెలంటూ చులకన చేయకు ..
ఆ వెన్నెల చల్లదనంలో సేద తీరిన జీవులెన్నో ..
ఉనికి మరిచి ఊరడిల్లిన హృదయాలెన్నో …
మిద్దెలపై మెరిసినా,సాగరంలో కురిసినా ..
అడవిలో కాసినా ..వెన్నెలెపుడూ చల్లనిదే ..విజయ గోలి
అల్లరి చేసే సమయంలో ఆగ్రహమెంతో వచ్చు ..
చిచ్చర పిడుగుల చేతలలో ..చిన్నికృష్ణుడే….తలపించు….
కొంటె పనులతో కొసరి మెప్పించు ..
నాటి యశోదమ్మకే తప్పని ..కష్టం …
ఆ అమాయకత్వమే ..పెంచును …
అందరి మదిలో తనివి తీరని ..ఇష్టం..విజయ గోలి
కలత నిదురలో కలలు కంటున్నా ..
కన్నీటి కడలిపై వారధి కడుతున్నా…
పదిలమైన స్మృతులను అడుగడుగునా అమరుస్తూ ..
మౌనం వెనుక మాటలను …నీ బాట నింపుతున్నా…
నిశీధి దాగిన వెలుగు కోసం వేచి చూస్తున్నా…
కనుచూపు మేరలో కనిపించని గమ్యం..
ఎదురుచూపుల కాలం నిండు వేసవిలో ..
ఎండమావిలా ఎదుట నిలుస్తుంది…విజయ గోలి .