అక్షరాలతో అందంగా రంగవల్లులేయాలని ..
అంతులేని..ఆరాటం ..స్పందనలను చుక్కలుగా ..
పెల్లుబికే..భావాలతో .పెనవేస్తూ కలపాలని …
విజయ గోలి.
తరిగిపోతున్న.. జాతి ..తరాల సంపదలో ..
తరగనీకు ..అనుబంధాల ..పెన్నిధిని ..
విజయ గోలి .
వెలుగు నీ వెనుకున్నపుడు నీడ నీ ముందుంటుంది ..
వెలుగు నీ ముందున్నపుడు నీడ నీ వెనుకుంటుంది ..
ముందో వెనుకో తోడుగ ఉందని నీడనెపుడు నమ్మకు ..
నిశీధిలో నువ్వున్నప్పుడు నీ నీడ జాడే ఉండదు ..విజయ గోలి