అక్షరాయుధం

శ్రీమల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
సప్తవర్ణాల సింగిడి. 23/8/2020
అంశం-:అక్షరమే ఆయుధం
నిర్వహణ-:శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు
రచన-:విజయ గోలి
ప్రక్రియ -:వచన కవిత
శీర్షిక-:అక్షరాయుధం
అక్షరాలే ఆయుధం
అజ్ఞానపు అగాధాలు
అధిగమించు సాధనం
ఉద్యమాల శకటానికి
ఉత్తేజిత ఇంధనం

అక్షరాల సంపదలే
న క్షరమౌ పెన్నిధులు
వరమే కద జీవితాన
వాగ్దేవి వరములు

శమంతకమణియై
వృద్ధినొందు దినదినము
దాచినను దోచలేని
ధనమే కద అక్షరం

అక్షరాల విలువ తెలిసి
అడుగు ముందుకేసావా
అణుబాంబుల విస్ఫోటనమే
అదిరిపోవు అణువణువు

అక్షరాలే అడుగు అక్షరాలే గొడుగు
అక్షరాల వర్ణించ అక్షరాలే చాలవు..

 

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language