అందాలా నందనమే

శుభోదయం🌹🌹🌹🌹🌹

గజల్. విజయ గోలి

అమ్మనాన్న ఉన్నఇల్లు అందాలా నందనమే
ఆటలతో అన్న చెల్లి బంధాలా నందనమే

అడుగడుగున కన్నవారి ఆదరణే ఆదర్శము
కసికందక నినుపెంచిన బాధ్యతల నందనమే

భారమైన నీకోరిక బరువులుగా తలచకనే
అడగకనే అందించిన కోవెలగా నందనమే

పసివాడిగ నీనవ్వులు వసివాడక నిలవాలని
నీప్రగతిన ప్రతిమెట్టున ఆసరాల నందనమే

పశ్చిమాన వలసపోయి పడవలనే తగలేస్తే
గుండెచెదిరి బండలైన త్యాగాలా నందనమే

సంపదలో మునిగిపోయి మూలాలే మరిచిపోతె

మమతలతో మన్నింపుల మంచితనాల నందనమే

కంటిచూపు కరిగిననూ కడచూపుకై ఎదురుచూచు
కన్నప్రేమ ఓడి గెలుచు  విజయా లా నందనమే

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language