వయసు కాలము

 

*వయసు…కాలము* విజయ గోలి

వయసు , కాలము రెండు ఒకటే
వయసు …లెక్కకు కాలము..
కాలము …లెక్కకు వయసు..
రెండు మనం కలుపుకున్నవే …
అందుకే చరిత్ర లో అవి రెండు…
సర్దుకు పోఇన దాఖలాలు లేవు …
వయసుకు రంగు వేసి కాలాన్ని ఆపాలని ..
కాలానికి కళ్ళెమేసి వయసును ఆపాలని..’

పిచ్చి ప్రయోగాలూ చేస్తూ …
పిచ్చివాడుగా మారిన…
మనిషీ !కాలాన్ని కూడా మనిషే ..కనుగొన్నది
పరుగులు తీసే పగలు ,రాత్రిని ….
క్రమశిక్షణ లోపెట్టేందుకే…
నిన్న,ఇవాళ,రేపు…

జారిపోయిన నిన్నను …
వదిలి ఇవాళ నుండే…
రేపటి కోసం వేచి చూసేలా ….

నిన్న అనుభవం

నేడు ఆనందం

రేపు ఆశ అంటూ

అందమైన పేర్లు పెట్టి కాలానికి హద్దులు గీయలేక
మనసు చుట్టూ గిరిగీసుకొని ఆ బరి లోనే…
బ్రతుకుతున్నాము …’బావిలో కప్పల్లా… విజయ గోలి

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language