చేలగట్టు

గజల్            విజయ గోలి…

చేలగట్టు వైరమంత చెరుపుకుంటె చెలిమేగా
వెంటరాని సంపదలను వదులుకుంటె చెలిమేగా

గట్టుమీద పారాడిన గుమ్మడంత ఉమ్మడేగ
ఆటలలో అరటిపండు గురుతుంటే  చెలిమేగా

గొబ్బిపూల అందాలతొ గోరింటల చందాలుగ
పంటసాగు నీరంతా  పారుతుంటే  చెలిమేగా

బంధమెపుడు బాటవెతుకు కలసిపోవు కబురుకొరకు
మధ్యవచ్చు మంధరలే మారుతుంటె చెలిమేగా

బంతిపూల తోరణాలు భాగమౌను *విజయా లతొ
కన్నవాళ్ళ కలలుతెలిసి కలిసుంటే  చెలిమేగా

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language