అందమైన భావనలుగ

విజయ గోలి. గజల్

అందమైన భావనలుగ భ్రమరాలు ముసిరెనులే
మధురమైన బంధాలుగ సోయగాలు మెరిసెనులే

అతివతెలియ బ్రహ్మ కైన అవనిమీద అందనిదే
అరుణిమలే ఆమోమున చిరుఅలకలు కులికెనులే

లాలనలో లలనలెపుడు లతలేగా హృదిపైన
లజ్జితగా ముకుళించగ  లలితాలు  విరిసెనులే

తెరిచిఉన్న పుస్తకమే తెలియరాని సాగరమే
సానపెట్ట సహనాల సాహసాలు సాగెనులే

అధిష్టించగ అతివమనసు ఆయాసము తప్పదుగా
అలుపుతీర విజయములుగ సుస్వరాలు పాడెనులే

 

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language