కాలంపై గెలుపు విజయ గోలి
ఒక్క రోజు మృత్యువు కొరకు
జీవితమంతా పరుగు తప్పదు
నుదుటి రాతతో నడక తప్పదు
బంధాలతొ ముడులు తప్పవు
విరపూసిన పూలతోట
పరిమళాల పరవిశిస్తూ
నా సొంతం అనుకుంటూ
గర్వంగా నవ్వుకున్నా…
ముంచు కొచ్చిన తుఫాను
ముగిసాకే తెలిసింది
ఎండుటాకుల కదలికైనా
భగవంతుడి చిత్తమని
కాలచక్రం కరకు దారిలో
పట్టు పట్టి పోటీ గా పరిగిడినా
గమ్యం లేని కాలానిదే ఎప్పటికీ గెలుపు
కాలం లో కరగని విజయ మొక్కటే …
కాలం పై నీ గెలుపు