ఆది దేవుని ఆవాసం
ఆనంద ధామమే కేదారం.
ముక్కోటి పూజలందు ముక్కంటి సౌధమే
అడుగిడితే అందునదే అంబరం
మనిషికందని మహిమలెన్నో
మౌనిగానె మనసు మారిపోవు
అస్థిత్వపు అనుభవమది
అందనిదే మాటలకు
భవ్యమైన నీరూపం
భక్తికందెడి ముక్తి దీపం
చేదుకోమని చేరివచ్చెడి
భక్తశ్రేణి కి పరమపదమిది
ఆదిశంకరుని అద్వైతమే
అల గాలిలో తేలి స్పృశియించు
క్షణ భంగురమే జీవితం
క్షణం క్షణం కదిలి పోవు
మేఘమాల ప్రబోధితం
నులివెచ్చని రవికిరణం
చిరు జల్లుగ హిమపాతం
జలపాతపు హోరులలో
మందాకిని మారుతాల
పరిభ్రమించు ప్రణవనాదం