శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
ఒంటరినని వగపేలా తెరచి చూడు హృదయాన్ని
నీలితెరలు తొలగించీ తరచి చూడు ఉదయాన్ని
గమ్యమెంతొ దూరమనీ శూన్యంలో చూపేల
చిరుచీమను చూసైనా నేర్వలేవ గమనాన్ని
కష్టంగా దారంతా కొండ రాళ్లు నిండినా
నీ చేతులు ఉలిగానే చెక్కిచూడు శిల్పాన్ని
మనసులోన మసకుంటే అడుగులోన తడబాటె
పసిపాపగ మారిపోతె చూడగలవు సత్యాన్ని
ఒడిదుడుకుల కడలిపైన ఓరిమితో నావ నడుపు
జీవితాన నవ్వులతో పట్టగలవు “విజయాన్ని !!