శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
గుండెసడిలొ నీపేరే గుడిగంటగ మ్రోగుతుంది
వెనుతిరిగి చూడమంటు చూపొక్కటి తాకుతుంది
ఏనాటిదొ పరిమళం తడుముతోంది మదిని ఇలా
ఇక్కడనే నను చుట్టిన జ్ఞాపకమై మెదులుతుంది
చూపులలో చూపుకలిపి చూసినదీ ఒక క్షణమే
మలిగి పోక ఈనాటికి మలిచూపుకై వెదుకుతుంది
నీవెవరో నేనెవరో నిజమేమిటొ తెలియకుంది
కాలమంత కదిలి కదిలి కలలోనే ఆగుతుంది
ఆశలెపుడు ఆకశాన తళుకులీను తారకలే
అమావస్య చంద్రుడికై అణువణువు వెతుకుతుంది