శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
వలదన్నా వలవిసిరీ వలపంతా గెలిచావు
కాదన్నా కనుపాపలొ దీపంగా నిలిచావు
మదిలోపల ఒదిగున్నది మాటొక్కటి మంత్రమై
జన్మలదే ఈ బంధం శిఖరంగా మలిచావు
ఎడబాటో తడబాటో తమకంలో తనువూగె
విరిగంధపు చినుకులంటి తలపులతో తడిపావు
సరిజోడుగ స్వరమాయే సవరించగ హృదివీణ
పెదవంచున ఒంపుల్లో ముత్యంగా మెరిసావు
తరువు నీడ “విజయంగా ఎద తలగడ చేసావు
పసిడి వన్నె కలనేతగా బ్రతుకుచీర నేసావు!!