శుభోదయం 🌹🌹🌹🌹🌹
ఆశల నెగళ్ళు వేసవి లాగే వెచ్చగ వెలుగు
ఆమని చిగుళ్ళు అల్లరి చేస్తూ పచ్చగ ఎదుగు
గూటిన గువ్వలు కువకువ మంటూ కూస్తూ ఉంటే
రెక్కల చప్పుడు ఎప్పుడు విన్నా ఇంపుగ మెదులు
పిలుపులు ప్రేమగ పిలుస్తు ఉంటే పలుకని దెవరు
గుండెను గుచ్చక గురుతులు ఎంతో తీపిగ పలుకు
మేఘము చాటున మెరిసిన తీగకు కుదురే లేదు
చినుకుల తడిచిన నేలను పంటలు స్థిరముగ పెరుగు
నేనును మరచితె మనుగడ లోనా మనమే ఘనము
*విజయము వెనుకన విలువలు ఎన్నో మెండుగ నిలుచు