శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
ఆ పాత మధురాల పాటలో తడవాలని ఉంది
వలపు తెలిపినా ప్రేమ గీతం పాడాలని ఉంది
కడలి తీరం కలసి రాసిన ఇసుక రాతల దారి
మళ్ళీ నీతో అడుగులు కలిపి నడవాలని ఉంది
కలల ఊట నాకలం నింపిన కవన పరిమళం
జడలోన జాజి గ నీ కొరకె నిలపాలని ఉంది
బంధ మంటే ఎండిపోని చెమ్మ నిండిన చెలమే
ఏడు జన్మల కధ నీ జతగా చదవాలని ఉంది
మాయ తెలియని మనసెపుడూ విశ్వ ప్రేమ సౌధమే
“విజయంగా ఆ బాటల విరులు నింపాలని ఉంది