తప్పులనే వెతికి

శుభోదయం 🌹🌹🌹🌹🌹

“వద్దు అనుకుంటె వంద తప్పులు
కావాలనుకుంటే కనుమరుగయ్యే హద్దులు”

తప్పు వెతికి ఒంటరిని చేయవద్దని …
కావాలనుకుని ప్రేమ ఖైదు చేయమనే ఒక హృదయపు అభ్యర్ధన ..
గజల్ రూపంలో…

తప్పులనే వెతికిచూపి ఒంటరినే చేయకోయి
ఒప్పులుగా కాచినన్ను ప్రేమఖైదు చేయవోయి

జన్మజన్మ బంధమైన అనుబంధమె  నీవోయీ

బందీనై వెంటనడుచు  వీడిపోని  నీడనోయి

మౌనంతో జవాబులే మారాకులు వేయవుగా
మది బదిలీ కారణాలు మంత్రాలని దాచకోయి

దినమంతా సూర్యుడివై వెతకబోకు చల్లదనం
నడిరేయిన వెన్నెలలో వెచ్చదనం దోచకోయి

కడలి ఒడి న కలతదాచ ఎగిసిఅలల వెతలుచూపు
వలసపోను వంకలేల వరమీయగ నిలవవోయి

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language