శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
ప్రేమదారి మల్లె పూల మనసు నింపె మౌనాలతొ
పయనమెంత పరవశమో పలుకునింపె పాటలతో
గువ్వల్లే గునుస్తుంది గుండెలోన తొలుస్తుంది
తెలియనిదే తీపిబాధ తరుముతుంది తపనలతో
దాచుటెంత కఠినమోగ దారేదో తెలియకుండె
దోచుకునీ దాచినవీ తడబడేను మాటలలో
కోయిలగా పాడాలని వసంతాల వనాలలో
తీయదనం నింపుకుంది మది మాటున రాగాలలో
మనసుదాటి వెలుగేదో మోములోన నవ్వుతుంది
వేచినాను ప్రియతమా తలుపుతీసి తలపులతో