శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 💐💐💐💐🌹🌹🌹🌹🌺🌺
శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
నవ్యశోభల శుభములివ్వగ తరలివచ్చెను వాసంతిక
పల్లకీలో *శుభకృత్ ను మోసుకొచ్చెను వాసంతిక
పల్లవించే చిగురు సొగసుల వల్లరి ఆట ఆమనిగా
అవని నిండుగ హరిత వర్ణం జల్లుకొచ్చెను వాసంతిక
ఎన్ని రంగులు ఎన్ని హంగులు సృష్టి హాసం మధురమేగ
తేనె నింపుకు పూల ఋతువై సాగివచ్చెను వాసంతిక
గున్నమావిన గువ్వ రాగం వగరు పులుపులు వొంపుతుంటె
కొమ్మ కొమ్మన కోయిల పాట తీసుకొచ్చెను వాసంతిక
ఛైత్ర మాసం చిత్రవన్నెలు రామచిలుకల రధము పైన
మరుని శరముల మల్లెలవగా కొలువు దీరెను వాసంతిక
శిశిరమెళ్ళిన చిద్విలాసం అడుగు అడుగున ఉరకలేసె
కనుల మెరిసిన కలల పండగ కానుకిచ్చెను వాసంతిక
ఆరు రుచులతొ అన్ని ఋతువుల విజయ గీతం ఉగాదిగా
మనసు మనసున మమతబంధం మేలుకొల్పెను వాసంతిక