శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
ఆకాశానికి నిచ్చెన వేస్తే తారల తాకే తీరాలంటా
కొండకు వెంట్రుక కట్టి లాగితే కొండే కదిలీ రావాలంటా
మూడేకాళ్ళని మూలుగువాడికి ముప్పే తప్పదు ఎప్పటికైనా
మూర్ఖత్వాన్నీ పక్కనపెడితే పట్టిన పట్టే గొప్పవునంటా
మంటలమీదా చిందులువేసే ఆటను చూస్తే అదిరే గుండెలు
సావధానమై సమస్యచూస్తే పరిష్కారమే దరి వుందంటా
సంకల్పములో బలమేవుంటే సాధించనిదీ ఏముంటుందీ
చదరంగంలో గెలవాలంటే చతురతఏదో నేర్వాలంటా
అడుగు అడుగునా విజయము గొడుగై నిలవాలంటే
అదుపు తప్పనీ ఆత్మబలమే అండదండగా ఉండాలంటా