రాగాలతొ రాధమ్మా పిలిచినదీ వేణువుగా
కనుపాపల దారినింపి నిలిచినదీ వేణువుగా
జాబిలమ్మ జాలిచూపు జగడములే రేయంతా
వెన్నెలలో వేడుకగా వేచినదీ వేణువుగా
చల్లలమ్ము గోపెమ్మల గోములోన మరచితివే
మదినిండిన మమతలతో తలచినదీ వేణువుగా
రాసలీల ఆటలలో రాలుగాయి కన్నయ్యా
గోధూళిలొ నీ రూపమె వెలిసినదీ వేణువుగా
వేపల్లియ వేలుపుగా కొలువైతివి కోరకనే
నందునింట నవ్వులుగా మోగినదీ వేణువుగా