మౌనమేల

శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి

మౌనమేల చీకటినే దుప్పటిగా కప్పుకుంది..
ఎవరిననీ అడగగలను ఎందుకిలా జరుగుతుంది

ఆగిపోయి శ్వాసలేల ఎగిరిపోయె ఎక్కడికో
గుండెనొదిలి చప్పుడెలా గుట్టుగాను దాగుతుంది

సద్దుమణిగె సంతోషం ఎక్కడనీ వెతకగలను
చుట్టుముట్టు జ్ఞాపకాలు సునామీగ చుట్టుతుంది

మదిని దాగి మాటలెన్నో పెదవిదాటి రాకున్నవి
తనువునొదిలి నీడెందుకు నిశీధిలో కరుగుతుంది

యోచనకే అందవుగా అంతులేని ప్రశ్నలుగా
కాలమిచ్చు జవాబుకై బ్రతుకుబాట వెతుకుతుంది

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language