శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
మల్లెపూల మరులజల్లు కురుస్తుంటె పులకరింత
చలచల్లగ తలపు తడిపి తాకుతుంటె పులకరింత
వసంతాలె వాలుజడల వలపుతీగ లల్లుతుంటె
మానసమే మధురోహల ఊగుతుంటె పులకరింత
వెదురు పొదల వేణువులే వినిపించీ కనిపించవు
వెంట వెంట దోబూచులు ఆడుతుంటె పులకరింత
తూనీగల ఆటలలో తుళ్ళిపడీ నల్లమబ్బు
చిరుచినుకుల పువ్వులనే రువ్వుతుంటె పులకరింత
అవనిమీద అమ్మతనం అణువణువున కమ్మతనం
వడి నిండుగ చందమామ నవ్వుతుంటె పులకరింత