శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
కళ్ళ తోడు కళ్ళు కలిపి కలలదారి పయనిద్దాం
చేయిచేయి పట్టుకుంటు చెలిమిదారి పయనిద్దాం
ఘడియలోనె రాలిపోయె పూల తోటి పోలికేల
వాడిపోని తలపులతో వలపుదారి పయనిద్దాం
దాగిపోయి జాగుచేయు జాబిలమ్మ జిలుగులేల
వెన్నెలంటి నవ్వులతో వెలుగు దారి పయనిద్దాం
వచ్చిపోయె వసంతమై వలస పరుగు మనకేలా
ఆరుఋతువులు ఆమనిగ పూలదారి పయనిద్దాం
నిప్పు నీరు భూమి గాలి ఆకాశం తోడునీడ
విజయంగా విశ్వంలో ప్రేమదారి పయనిద్దాం