
శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
మనసుమీటి పాటొక్కటి పాడాలని తలిచేను
తీగలనే శృతిచేస్తూ కాలాన్నై కరిగేను
చిగురించే భావాలకు పదాలనే పొదగలేదు
చిరుగాలుల రాగాలతొ దోబూచులె ఆడేను
ఊహలలో గీసుకున్న ఆ రూపం అపురూపం
గాలివాలు అలల సాగు గళమైనా వినలేదు
కదిలిపోవు అడుగులసడి ఎరుకైనది ఆఒక్కటి
తలుపు తీసి రమ్మంటూ ఈనాటికి అనలేను
జరిగేనో…జరగనిదో.. ఏనాటికి విజయమౌనొ
ఆశలలో ఆనందం ఆమనిగా మలిచేను