విజయ గోలి ….బ్రతుకు దివ్వె
నాకు తెలియని నేను ..ఎపుడూ అబ్బురమే …
మనసులో వున్నదే..మాటగా చెప్పాలనుకుంటా..
నీ మాట ..నను..మాటాడనీయదు …
అందరి ముందు చూపే అహంకారం ..
మంచులా కరుగుతుంది నీ మమకారానికి..
చిరు చిరాకుల మధ్య ఏకాంతం కోరుకుంటా ..
నీ మాటల గారడీ తో చిరాకు చిరుహాసం అవుతుంది ..
నీ పై కోపాన్ని కటువుగా చూపాలనుకుంటా ..
నీ చూపుతోనే మంత్రం వేస్తావు …నను. మౌనిలా మారుస్తావు
నేనేంటో ..నాకె తెలియని ..భ్రమలా..నను చుట్టేస్తావు …
వందమందిలో ఉన్నా ..ఒంటరి నేనని అనుకుంటా ..
జంటగా వుండే నీ జ్ఞాపకమే …నే ఒంటరి కాదంటుంది …
నీ ఉఛ్వాసల ..నిశ్వాసలలో ..నే నిండి ఉండాలని ..
మౌనం గా కాకుండా మాటగా చెప్పాలని అనుకుంటా ..
నీ శ్వాసల గుసగుసలో …ఆ వూసే ..మాసిపోతుంది ..
మధువులు నింపే నీ మురళిపాటలో…
నేనొక రాగమై..కరిగిపోతుంటా…కృష్ణా..
నా బ్రతుకును నీ ముంగిట ..దివ్వెను చేస్తూ ..విజయ గోలి