కుళ్లిపోయిన జంతువు..కంపును మించిపోయిన ..
ఇరుకు మనసులలోని మురికి ఆలోచనల కంపు ..
కామం తో మూసుకు పోయిన కంటి చూపులో …
అమ్మ ఎవరో…ఆలి ఎవరో..చెల్లి ఎవరో…కూతురెవరో ..
పసికందో….నెత్తురోడుతున్న ..పిండమో ..
గోవైనా…మేకైనా …నక్కైనా …కుక్కైనా ..
ఆడదైతే చాలు..మనిషి ముసుగేసుకున్న ..మృగానికి
.
ఏ దెస…పోతుంది ఈదేశ ..ధర్మ సంస్కృతి ..
ఈ నరరూప రాక్షుసులను చీల్చి ,చెండాడే ..
నార సింహుడు ఎప్పుడొస్తాడో….ఎక్కడున్నాడో ..విజయ గోలి
పుడమి తల్లి కన్నుల చెలమలెండి పోయాయి.
బీడు పడిన భూములపై కలుపు మొక్క కరువాయె
గుండెనిండిన నిరాశల నిట్టూర్పులు..
గాలివాటు మబ్బులపై గంపెడాశలు..
గాడి తప్పుతున్న ఋతువుల గతులు
ఆదిత్యుని ఆదరాన్ని తట్టుకోలేక ..
వరుణుడొచ్చే తరుణం కోసం…..
తడి ఆరని కన్నులతో …తపించే బ్రతుకులు . విజయ గోలి
విజయ గోలి ..గుంటూరు శీర్షిక -:సీతాకోకచిలుక
గుబులు లేక గూడులో తొంగున్నపుడు అదే లోకమనుకున్నా
గూడువదిలి రెక్కలతో బయటికి వచ్చాకే తెలిసింది …
ఇంద్రధనుస్సు రంగులతో ఇరుకైన లోకమొకటుందని .
మధువు నింపిన పూలగిన్నెల జాడకోసం వెతకలేనని ..
కాలుష్యపు కడలి నీడ సహజమైన అందాలను కాటేసి ..
కసి కసిగా రెక్కలు విరిచేసి అవిటిదాన్ని చేస్తుందని
ఒంటి చేత్తో ఒడిసి పట్టే వానచుక్క దాహం తీర్చదని.. విజయ గోలి