కనులనిండ నీ రూపము

గజల్. విజయ గోలి

కనులనిండ  నీరూపమె కాదనకులె గోపాలా
పిలిచినదే నీగానమె లేదనకులె గోపాలా

కనులుతెరిచి చూడబోగ కానరావు న్యాయమేన
వేధించగ వేడుకేల రాననకులె గోపాలా

వెన్నెలంత ఏటిపాలు వలపంతా నీటిపాలు
మాయగాడ మనసులతో ఆటనకులె గోపాలా

చెంగలువతొ. చెంపతాకి చేయితాకి జారిపోయి
దొంగాటల దోబూచుల దొరవనకులె గోపాలా

అడుగులసడి నీదేలే నవ్వులజడి ఎరుకేలే
ఎదఅలజడి సవ్వడిలో కలననకులె గోపాలా

వేచివుంది యమునాతటి రాచలీల వేడుకకై
నీఉనికిని తెమ్మెరలే తెలిపేనులె గోపాలా

జాగేలర జాజిపూల జడివానలొ *విజయములే
జగడముల  జాజరలో మురిపములే గోపాలా

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language