పునరపి మరణం

శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం. ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి…28/8/2020

అంశం-:ఐచ్ఛిక కవనం

నిర్వహణ-:శ్రీమతి గాయత్రిగారు హరి రమణ గారు కవితా కులకర్ణిగారు

రచన-: విజయ గోలి

శీర్షిక-:*పునరపి జననం *

పునరపి జననం పునరపి మరణం

జీవికెందుకు..తీరని మోహం..దేహంపై

బంధాల చెరలలో బానిసవుతూ

బ్రతుకు గమ్యం శూన్యమవుతూ

ఎక్కడో ఒక తొలి కేక

మరెక్కడో ఒక ఆఖరి కేక

బంధాలు త్రెంచుకుంటున్న ..

ఆత్మల ఆఖరి కేకలు..

నూతన చైతన్యాన్ని నింపుతూ ఒకటి ..

దేహాన్ని అచేతన పరుస్తూ ..మరొకటి..

నిరంతర పయనంలో ..నిర్ణీత మజిలీలలో ..

కర్మల బరువును మోస్తూ ..

సందిగ్ధపు సమాధి స్థితిలో

సమతుల్యాన్ని  వెతుక్కుంటూ.

మరో మాయా లోకంలోకి   ..

అడుగిడుతూ..మరుజన్మకు..మళ్ళీ

మనుగడ మొదలెడుతూ ..

అంతుదొరకని..అవ్యక్తాలను..ప్రశ్నించుకుంటూ

పునరపి మరణం..పునరపి జననం

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language