నిలువుటద్దం

నిలువుటద్దంలో ప్రతిబింబం నిలదీస్తుంది

నీకోసం నువ్వు బ్రతికిన క్షణాలు ఎన్నంటూ ..

ఒంటరినని పొగిలి ,పొగిలి..ఏడ్చిన

వ్యధ నిండిన రాత్రులే ఎదుట నిలిచాయి ..vijaya goli

వృక్షో  రక్షతి  రక్షితః ..తరువు పెంచగ తరుణమిదియే..

పర్యావరణమే క్షీరసాగర మధనమాయెను..

విషంగ్రక్కుతు కాలుష్యం కరాళనృత్యం చేస్తుంది .

కరుణతో గరళాన్ని  గళమున దాచే శివుడు లేడు.

మోహిని యై అమృతాన్ని ముదమున పంచే హరి లేడు..

పుడమి తల్లిని కాపాడగా అన్నినీవై గొడుగు పట్టి అడుగు వేయి ..vijaya goli

ఆకాశం అంచులు చూడాలనేది ఆశైతే

సాగరాన్ని  దాటి ఆవలి తీరం చేరాలనేది అత్యాశే.

రెండు  కలిసిన  క్షితిజాన్ని  చూసినప్పుడే తెలిసింది

అలవిగాని  ఆశలన్నీ  అందని ద్రాక్షలని ,

మండుటెండలో దాహం తీర్చే ఎండమావులని .vijaya goli

మిత్రులకు  శుభోదయం 🙏🙏

ఆకుపచ్చ పట్టు  చీరకు

నారింజ అంచు రంగు

నీలిరంగు పైట కొంగు ..

జలతారు జరీ పూలు

చేయి తిరిగిన నేతగాడు..

పడుగు పేకల వన్నెలద్దినట్లు .

ఉదయ భానుని తొలి కిరణాలతో

పుడమికి  ప్రకృతి చేసిన సింగారం ! Vijaya goli

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language