శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఆంధ్ర ప్రదేశ్
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 25/11/2020
అంశం-: కార్తికోత్సవం అయ్యప్ప చరిత్ర
నిర్వహణ – పూజ్యులు శ్రీ వెలిదె ప్రసాద శర్మ గారు
పర్యవేక్షకులు-: పురాణ కవి వర్యులు శ్రీ బి వెంకట్ కవి గారు శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు
రచన-: విజయ గోలి
పంపానది తీరం పరమ పావనం
శబరిగిరుల ఆవాసం స్వామి నివాసం
హరిహర సుతుడు అయ్యప్ప
శివకేశవుల స్ఫూర్తి కాంతి
శరణు అంటే కరుణ చూపు
కరుణామయుడు స్వామి అయ్యప్ప
మహిషిని వధింప మనుష్య రూపమున
మణికంఠుడుగా వెలిసాడు
మహిమలు చూపి శబరిగిరుల
కర్పూర వెలుగుగా కాచేను
నిష్ట నియమాల మండల దీక్ష
మలినం నిండిన మనసు ప్రక్షాళన
చందన ధారణ మహాభాగ్యం
మనో నియంత్రణ మార్గ దర్శకం
ఇరుముడి తాకిన దీవనలు
భక్తుల ఇడుములు బాపును వడివడిగా
పద్ధెనిమిది పడిమెట్ల అధిరోహణ
పరమపదానికి పావన సోపానం
మకర జ్యోతి దర్శనం మహిమాన్వితం
దీక్ష తోడి దర్శనం ద్విగుణీకృతమౌ ఐశ్వర్యం
మహిమగల మహరాజు మణికంఠ దేవుడు