భ్రమరాంబికా దేవి

శ్రీమల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాలసింగిండి 26/11/2020
అంశం -: కార్తీక మహోత్సవం.శ్రీశైల భ్రమరాంబికా దేవి
నిర్వహణ-: శ్రీ బి వెంకట్ కవి గారు శ్రీ తగిరంచ నరసింహా రెడ్డి గారు
రచన -: విజయ గోలి
ప్రక్రియ -: వచన కవిత

అష్టాదశ పీఠాల ఆరవపీఠముగ
నల్లమల అడవుల కృష్ణమ్మతీరాన
శ్రీశైలమున వెలసి నిలిచిన తల్లి
సిరుల అలరించు శ్రీ పాలవెల్లి
శ్రీగిరి భ్రమరాంబిక..తల్లి

మల్లెపూవుల తోడి మహేశు అర్చించి
మల్లికార్జుని పేర మనువాడినావు..
పాలధార పంచధారల నడుమ
ఇష్టకామేశ్వరి వై ఇలను కాచేవు

మనుజులతో మరణమే లేకుండ
వరములే పొందిన అరుణాసురుని
అంతమే చేయగా భ్రమరియై భాసిల్లి
భ్రమరాంబగా భక్తులను గాచేవు

జ్యోతిర్లింగాలలో జయముగా
శ్రీశైల శిఖరదర్శనం జన్మ ధన్యముగ
చెవిటి మల్లయ్య కధలెన్నో
వినసొంపు కబురులే వివరాలలో

ఒడిబియ్యము పోసి వనితలే కొలిచేరు
పసుపుకుంకుమల వరమిచ్చు వరదాయిని
ముల్లోకాల మూలమంత్రమై నిలిచిన ముత్తైదువ
చీడపీడలబాపి చిడుముల బాపి
కరుణించు మా తల్లి కాత్యాయని🙏🏻🙏🏻🙏🏻

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language