శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం
ఏడుపాయల
సప్తవర్ణాల సింగిడి
అంశం-:సి నా రె కవనం. 29/7/2020
నిర్వహణ-:శ్రీ వెలిదె ప్రసాద శర్మ గారు
రచన-:విజయ గోలి. గుంటూరు
శీర్షిక -: విశ్వంభరుడు
విశ్వంభరా…
నిన్ను కన్న భరత భూమి…
పుణ్యమెంతటి ఘనమో…
పంచెకట్టుతో ..పసిడి తనముతొ
తెలుగుతనముకు అద్దమేకద..
తలచుకుంటే…సి నా రె
తెలుగు సాహితీ నందనంబున
నీ కలము మీటని..ప్రక్రియేది..
నీవు ఎక్కని గద్దెలేవి..
నీవు పొందని బిరుదులేవి
అడుగు మోపని దేశమేది..
తెలుగు కీర్తికి వన్నెలద్దిన …సి నా రె
*మట్టి మనిషి ఆకాశం..
*కొనగోట మీటిన జీవితాలే…
*కలిసి నడిచిన కలంతో..
*కర్పూర వసంత రాయుని ..
కొలువు దీర్చిన ….సి నా రె
*కలం సాక్షిగ ..*రెక్కల సంతకాలతొ
*భూగోళపు మనిషిగా..*
విశ్వానికి *విశ్వంభర*కావ్యమిచ్చి
*విశ్వనాధ నాయకుడివై
జ్ఞానపీఠ మెక్కినావు సి నా రె
చిత్రసీమన నీదొక..
చెరగని ముద్ర వేసి..నవరసాలతొ ..
నింగి నేలను నిండినావు
నీ జన్మ దినమున మా జోతలివే..
అక్షరాంజలుల అర్పణలివి…సి నా రె