*గోడకు చెవులు
రచన-:విజయ గోలి
గోడలకు చెవులున్నా
చెట్టుపుట్టకు నోరున్నా
చెరుపు మనిషి చేతకే
చింతలలో చిగురించదు
గమనమంత గాలివాలు
గోడకున్న చెవులతో..
అడవి దాకా కదిలింది
రామాయణ కధనం
దశరధుడి మరణం
గోడలకే చెవులుంటే ..
ఊటబావి వూరింతలు
ఊరంతా ఘుమఘుమలు
పుకారులే షికారులై
పూతరేకు పంచిపెట్టు
గోడ చెవులు మూసి పెట్టి
గుండె తలుపు తీసి పెట్టు
ఎదుటివాడి బ్రతుకంత
ఎగతాళిగ చేయపోకు
చేయిదాటి పోయాక
చేయగలది ఏమిలేదు.