కనులు మూసి కలగంటె

20/8/2020
గజల్    విజయ గోలి

కనులుమూసి కలగంటే కాలమాగి పోదుకదా
గీసుకున్న గీతలతో రాతమారి పోదుకదా

పూవుతావి స్నేహంలో తుమ్మెదలే కమ్ముతుంటె
చేసుకున్న బాసలకే చేతమారి పోదుకదా

సహనంతొ సరిహద్దులు ఎంచకుంటె మేలుకదా
అడుగడుగున అణచివేత జాడమారి పోదుకదా

రాచబాట హంగులెపుడు పొంగిపోవు రంగులేను
నిర్భయముగ నిలబడితే దారిమారి పోదుకదా

సరదాలే సంకెళ్ళుగ సాగుతున్న విజయంలో
పూతోటలొ విరిముళ్ళతొ ప్రాణమారి పోదుకదా

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language