*బ్రతుకు భయం🌹🌹🌹🌹విజయ గోలి
బ్రతుకంటే భయం..భవితంటే భయం
జ్ఞాపకాలు మీటేందుకు గతమంతా శూన్యం
నిజంలోన నిద్రిస్తూ ..కలల దారి వెతుకుతున్నా
ఎండమావి నీటి తో దప్పికార్పుకుంటున్నా
గమ్యం నాలోనే వున్నా ..దిక్కులన్నీ వెతుకుతున్నా
అమావాస్య చీకటిలో వెన్నెలకై వెతుకుతున్నా
వెలకట్టిన దేహానికి ..రంగులద్దుకుంటున్నా
నడుస్తున్న కాలానికి గడువు లెక్కలేస్తున్నా
మనిషిననే మాట మరిచి మరబొమ్మగా నేనున్నా
మ్రోడు పైన చిగురు కొరకు ఆశగానే చూస్తున్నా..