కనులనిండ నీ రూపమే గజల్

విజయ గోలి   గజల్

కనులనిండ. నీరూపమె  కాదనకులె గోపాలా
పిలిచినదే  నీగానమె  లేదనకులె గోపాలా 

కనులుతెరిచి  చూడబోగ. కానరావున్యాయమేన
వేధించగ వేడుకేల రాననకులె గోపాలా

వెన్నెలంత ఏటిపాలు  వలపంతా నీటిపాలు
దొంగాటల దోబూచుల దొరననకులె గోపాలా

చెంగలువతొ చెంపతాకి  చేయితాక జారిపోయి
మాయగాడ మనసులతో ఆటనకులె గోపాలా

అడుగులసడి  ఎరుకేలే నవ్వులజడి నీదేలే
ఎదఅలజడి   సవ్వడిలో కలననకులె గోపాలా

యమునాతటి  వేచిఉంది రాచలీల వేడుకకై
నీఉనికిని  తెమ్మెరలే  తెలిపేనులె  గోపాలా

జాగేలర  జాజిపూల జడివానలొ *విజయములే
జావళీల జాతరలో  మురిపములే   గోపాలా

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language