శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
జారిన మాటలు జగడపు బాటలు విరుగును మనసులు
చెలిమే కలిమిగ బంధం సాగితె పెరుగును విలువలు
సూర్యుడు చంద్రుడు పెట్టని నగలే ఆకాశానికి
చెదరని నవ్వులు దాగని పెన్నిధి ధరపై మెరుపులు
చల్లని నీడగ నిలిచిన తరువును తుంచకు ఎపుడూ
ఒంటరి వేళల ఓరిమి ఓడితె సాగవు బ్రతుకులు
నలుగరు నడిచే పధమున ఏరిన ముళ్ళూ రాళ్ళే …
దైవం పూజలొ పూలై రాలును పుణ్యం వెలుగులు
కాలం ఒడిలో కరగని లక్ష్యం గెలుపులె సాక్ష్యం
జాబిలి పైనా విజయపు జాడలు చరితలొ మలుపులు