వటపత్ర సాయి

మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల

*వటపత్రసాయి   విజయ గోలి

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ |

శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్🙏🏻🙏🏻

వటపత్రసాయివై  వామనుడవై

భువనములు నిండిన భోగివై

మహా యోగివై అంతర్యామివై

మనసునిండినమాధవుడివై

చేయివీడని చెలిమివై ,చేతవై

కలవై ఇలవై కలిమివైతివే ..కృష్ణా🙏🏻🙏🏻

అంతమే లేని మాతృష్ణలే తీర్చగా

చెరసాలను పుట్టి మాయ తెలిపితివి

అడుగడుగు గండాల అలవోకగా పెరిగితివి

శిఖిపింఛమౌళివై చిరుమువ్వల సవ్వడిగ

చిన్నికృష్ణుని వోలె  చిరుతనవ్వుల మెరిసితివి

నందగోకులమంత  చిందులేయగ కృష్ణా🙏🏻🙏🏻

మన్నుతిన్న నోట మిన్నులను చూపితివి

వెన్నదొంగవోలె వేడుకలు చేసితివి

గోవర్ధనమెత్తి గోకులము గాచితివి

వలువలను దోచితివి విలువలే తెలిపితివి

ఆత్మజ్ఞానము తెలిపి అన్ని నీవైతివే గోపాల🙏🏻🙏🏻

వెదురు వేణువు చేసి రాగాల రంజిల్ల

వెలదుల  నడుమ వెన్నుడవై  రాసలీల

వెలిగి  తాథ్యాత్మమున తనువు మరిచి

మనసు నీలోన  మలుపుట తెలిపితివి

పరము చెప్పి గురువైతివి పరంధామా🙏🏻🙏🏻

కురుక్షేత్రమే నీవుగ

ధర్మము ధరణిపై నిలిపిన నీరజాక్షా

నరుడివై నారాయణుడివై. భగవద్గీత బోధించి

విశ్వమే నీవంటు విరాట్ రూపమే చూపి

భవ బంధాల భ్రమలు బాపేవు  గోవిందా🙏🏻🙏🏻

శరణంటు చరణములు తాకితే

కడవరకు కర్తవై కాచేవు కన్నయ్య

ధర్మచింతన తోడి దరి చేరువానికి

చక్రివి నీవై చెంత నిలిచేవు  చక్రధారి

కర్మఫలములు కాచి పరమపదమున

నిలుప పరిపరి వేడేము పరంధామ🙏🏻🙏🏻

కృష్ణవై విష్ణువై రాముడై రమణుడవై

     కాపాడు జగద్రక్షవై🙏🏻🙏🏻🙏🏻🙏🏻

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language